టి కాంగ్రెస్ వారిద్దరినే నమ్ముకుందా?

52
- Advertisement -

గత కొన్ని రోజులుగా టి కాంగ్రెస్ మంచి జోరుమీద ఉంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది పక్కా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ప్రణాళికలను అమలు చేస్తోంది. ఒకవైపు చేరికలను ఆహ్వానిస్తూనే మరోవైపు పార్టీ అభ్యర్థుల ఎంపిక పై తుది కసరత్తులు చేస్తోంది. వచ్చే నెలలో మొదటి విడత అభ్యర్థులను ప్రకటించేందుకు గట్టిగానే ప్లాన్ చేస్తోంది. ఇదిలా ఉంచితే గతంలో టి కాంగ్రెస్ లోని లుకలుకలు మళ్ళీ ఎన్నికల ముందు తెరపైకి వస్తాయా అనే డౌట్ పార్టీ హైకమాండ్ లో కనిపిస్తోంది. ఆ మద్య రేవంత్ రెడ్డి మరియు పార్టీ సీనియర్స్ మద్య పచ్చగట్టి వేస్తే భగ్గుమనెంతలా వివాదాలు నడిచాయి..

ఫలితంగా పార్టీ పూర్తిగా బలహీన పడుతున్న క్రమంలో కర్నాటక ఎన్నికల్లో విజయం తిరిగి ఊపిరిపోసింది. ప్రస్తుతం ఎలాంటి విభేదాలు లేవని కలిసికట్టుగా పార్టీకి విజయాన్ని అందిస్తామని టి కాంగ్రెస్ నేతలు చెబుతున్నప్పటికి… ఏదో మూలాన గత పరాభవాలు అధిష్టానాన్ని కలవర పెడుతూనే ఉన్నాయి. అందుకే టి కాంగ్రెస్ గెలుపు బాధ్యతలను డీకే శివకుమార్ మరియు ప్రియాంక గాంధీకి అప్పగించే ఆలోచనలో ఉందట హస్తం హైకమాండ్. కర్నాటక ఎన్నికల్లో హస్తం పార్టీ విజయనికి డీకే నాయకత్వం ప్రధాన బలంగా నిలిచింది. అక్కడ డీకే విసిన వ్యూహాలు, ప్రణాళికలు పార్టీకి గ్రాండ్ విక్టరీని కట్టబెట్టాయి.

Also Read:అంతర్జాతీయ యూత్ డే..

అందుకే తెలంగాణ విషయంలో కూడా డీకే శివకుమార్ నే నమ్ముకున్నట్లు కనిపిస్తోంది. ఇక ప్రియాంక గాంధీ వాక్చాతుర్యానికి ప్రజలు ఆకర్షితులయ్యే అవకాశం ఉందని, ఇప్పటికే తెలంగాణలో పలుమార్పు పర్యటించిన ప్రియాంకా గాంధీకి తెలంగాణ ప్రజల నుంచి మంచి ఆధారణ లభించిందని హైకమాండ్ భావిస్తోంది. అందుకే తెలంగాణలో ఎంతమంది నేతలు ఉన్న గెలుపు బాద్యతలను డీకే శివకుయాంర్ మరియు ప్రియాంకా గాంధీ భుజలపైనే వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక నుంచి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలన్నీ వీరిద్దరే డీల్ చేయనున్నట్లు తెలుస్తోంది. మరి డీకే శివకుమార్ మరియు ప్రియాంక గాంధీ తెలంగాణలో కాంగ్రెస్ కు ఎంతవరుకు బలం అవుతాయో చూడాలి.

Also Read:హారర్ థ్రిల్లర్… ‘పిజ్జా3’

- Advertisement -