పాస్‌ పోర్ట్‌ ఇండెక్స్‌లో 87వ స్థానం : హెన్లీ ఆండ్‌ పార్టనర్స్‌

82
passport
- Advertisement -

ప్రపంచీకరణ తర్వాత ప్రపంచం చాల చిన్నదైపోయింది. కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశాలకు కూడా విద్య, వ్యాపారరీత్యా వెళ్లాల్సి రావడం షరా మామూలైంది. అయితే మనం ఇతర దేశాలకు వెళ్లాలంటే ఆ దేశ అనుమతి (వీసా) తప్పనిసరి. అది లేకపోతే ఆ దేశంలోకి ప్రవేశించడం చట్టరిత్యా నేరం. అయితే కొన్ని దేశాలకు మాత్రం ఈ నిబంధనల్లో సడలింపులు ఉన్నాయి. ఆ దేశ పాస్‌పోర్ట్‌ ర్యాంక్‌ ఆధారంగా అందులోని పౌరులు వీసా లేకుండానే ఇతర దేశాలకు ప్రయాణించే వీలు ఉంటుంది.

ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్‌ సమాచారం ఆధారంగా హెన్లీ ఆండ్‌ పార్టనర్స్‌ పరిశోధకుల బృందం ప్రతి ఏటా ఈ జాబితాను రూపొందిస్తుంది. 2022కు గాను హెన్లీ పాస్‌ పోర్ట్‌ ఇండెక్స్‌ ప్రకారం భారత్‌ 87వ స్థానం దక్కించుకుంది. దీని ప్రకారం భారతీయులు వీసా అవసరం లేకుండా 60 దేశాలకు ప్రయాణించే వెసులుబాటు ఉంది. ‌ ఆఫ్రికాలోని 21 దేశాలకు, అమెరికాలోని 2 దేశాలకు, ఆసియాలోని 11 దేశాలకు, కరేబియన్‌లోని 11 దేశాలకు, యూరోప్‌లోని 2 దేశాలకు, మధ్యాసియాలోని 4 దేశాలకు, ఓసియానాలోని 9 దేశాలకు భారతీయులు విసాలు లేకుండా వెళ్లవచ్చని తెలిపింది. ఈ జాబితాలో.. జపాన్‌ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌ పోర్టును కలిగి ఉన్న దేశంగా నిలిచింది. జపాన్‌ పౌరులు వీసా లేకుండా 193 దేశాలు చుట్టేయవచ్చు. రెండో స్థానంలో సింగపూర్‌, దక్షిణ కొరియాలు ఉన్నాయి.

- Advertisement -