ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 2022వ ప్రపంచకప్ లో భారత్ ఘోరంగా పరాజయం పాలైంది. అడిలైడ్ వేదికగా జరుగుతున్న ఇంగ్లండ్ ఇండియా మ్యాచ్‌లో భారత్ దారుణంగా ఓడిపోయింది. టీ20 వరల్డ్‌కప్ రెండవ సెమీస్‌లో ఇంగ్లండ్ పది వికెట్ల తేడాతో ఇండియాపై జయభేరి మోగించింది.
తొలుత టాస్ గెలిచి బౌలింగ్ దిగిన ఇంగ్లండ్ ఆరంభంలోనే తుస్సుమన్నారు. ఓపెనర్ కేఎల్ రాహుల్ వెంటనే పెవిలియన్ బాట పట్టారు. అనంతరం వచ్చిన కోహ్లీ రోహిత్ హర్ధిక్ గౌరవప్రదమైన స్కోరు వల్ల భారత్ నిర్ణీత 20ఓవర్లో 168పరుగులు చేసింది.
ఇండియా విసిరిన 169 రన్స్ టార్గెట్‌ను ఇంగ్లండ్ ఈజీగా చేజ్ చేసింది. అలెక్స్ హేల్స్, జోస్ బట్లర్‌లు ఇండియన్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఇద్దరు ఓపెనర్లు భారీ షాట్లతో అలరించారు. ఫోర్లు, సిక్సర్లు కొడుతూ ఇండియన్ బౌలింగ్ అటాక్‌ను నీరుగార్చారు.
హేల్స్ 86, బట్లర్ 80 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచారు. 16 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 170 రన్స్ చేసింది ఇంగ్లండ్. దీంతో ఫైనల్ చేరినా ఇంగ్లండ్ ఆదివారం మెల్‌బోర్న్‌లో జరిగే ఫైనల్ ఈవెంట్ అమితూమి తేల్చుకోనుంది.
ఇవి కూడా చదవండి..