పాకిస్తాన్‌లోని బాలూచిస్తాన్ మచ్ ప్రాంతంలో జాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ చేసినట్లు బాలూచ్ విముక్తి దళం (BLA) అనే వేర్పాటు వాద మిలిటెంట్ గ్రూప్ ప్రకటించింది. సుమారు 200 మంది బందీలను పట్టుకున్నామని ప్రకటించారు. అయితే ఇవాళ ఉదయం నాటికి 155 మంది ప్రయాణీకులను భద్రతా బలగాలు రక్షించగా 27 మంది ఉగ్రవాదులను హతమార్చారని సమాచారం.
క్వెట్టా నుండి పేషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను మంగళవారం హైజాక్ చేసింది బాలూచ్ విముక్తి దళం (BLA). 425 మంది ప్రయాణికులతో 9 బోగీలతో వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై మిలిటెంట్లు కాల్పులు జరిపారు. గుడాలార్ మరియు పీరు కున్రి సమీపంలోని మష్కఫ్ సొరంగం వద్ద రైలు వెళ్తున్న సమయంలో దాడి జరిగింది.
రైలును హైజాక్ చేయడానికి ముందు, తిరుగుబాటుదారులు రైల్వే ట్రాక్‌ను పేల్చివేశారు. ప్రస్తుతం రెస్య్కూ ఆపరేషన్ కొనసాగుతోందని పోలీసులు తెలపగా బీఎల్ఏ కార్యకర్తలను జైలు నుండి విడుదల చేయాలని ప్రభుత్వానికి 48 గంటల డెడ్‌లైన్ విధించింది BLA. జాఫర్ ఎక్స్‌ప్రెస్‌లో ఉన్న 425 మంది ప్రయాణికులలో 80 మంది సైనిక సిబ్బందిగా ఉన్నారు.
2024 నవంబర్‌లో, క్వెట్టా రైల్వే స్టేషన్లో జరిగిన ఆత్మాహుతి దాడిలో కనీసం 26 మంది మరణించగా, 62 మంది గాయపడ్డారు.
Also Read:మారిషస్‌లో మోడీ.. నాడు.. నేడు!

