- Advertisement -
కొవిడ్-19 వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జులై 15 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు డీజీసీఏ ఉత్తర్వులు విడుదల చేసింది. అయితే ఈ నిషేధం అంతర్జాతీయ కార్గో విమానాలకు, ప్రత్యేక పరిస్థితుల్లో నడిచే విమానాలకు వర్తించదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది. దేశీయ విమాన సర్వీసులు మాత్రం యథాతథంగా కొనసాగుతాయని తెలిపింది. అంతర్జాతీయ విమాన సర్వీసులు మార్చి 23 నుంచి నిలిచిపోయిన సంగతి తెలిసిందే.
- Advertisement -