ఆర్థిక మూలాధారాలు బలంగా ఉన్నాయి : నిర్మలా సీతారామన్‌

69
nirmala
- Advertisement -

భారత స్థూల ఆర్థిక మూలాధారాలు బలంగా ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రాజ్యసభలో పేర్కొన్నారు. ధరల పెరుగుదల కంట్రోల్‌ ఉన్నదన్నామె…ప్రతిపక్షాల వాదనలకు బలం లేదన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభలో ద్రవ్యోల్బణంపై జరిగిన చర్చకు మంత్రి సమాధానమిస్తూ ఇతర దేశాలలో ద్రవ్యోల్బణాన్ని ప్రస్తావిస్తూ ఆర్‌బీఐ మరియు ప్రభుత్వం చేసిన కొంత ప్రయత్నం వల్ల, 7 శాతం ద్రవ్యోల్బణం రేటు వద్ద ఉన్నామన్నారు. ద్రవ్యోల్బణం లేదని మేము చెప్పడం లేదని కాని ధరల పెరుగుదలను ఎవరూ తిరస్కరించడం లేదని ఆమె ప్రకటించారు.

రిటైల్ ద్రవ్యోల్బణాన్ని పరిష్కరించడానికి ప్రభుత్వం గ్రౌండ్-లెవల్ ఇన్‌పుట్‌ల ఆధారంగా లక్ష్య విధానాన్ని అవలంబిస్తున్నామని, ధరల పెరుగుదలపై చర్చకు సమాధానంగా సీతారామన్ తెలిపారు. కొన్ని అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల కంటే భారత ఆర్థిక వ్యవస్థ చాలా మెరుగ్గా ఉందన్నారు. మహమ్మారి మరియు రష్యా ఉక్రెయిన్ సంక్షోభం వల్ల సరఫరా గొలుసు దెబ్బతిన్నదని, ఆహారం మరియు ఇంధన ధరలు పెరగాయని సీతారామన్ సోమవారం నాటి లోక్‌సభలో ప్రసంగించారు. ధరల పెరుగుదల ఏ దేశానికీ అతీతం కాదని భారత్‌ అందుకు మినహాయింపు కాదనే విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. ద్రవ్యోల్బణం 7 శాతంగా ఉందని, యూపీఏ హయాంలో ఇది రెండంకెల స్థాయికి చేరిందని గుర్తు చేశారు.

బ్యాంకుల నుంచి నగదు ఉపసంహరణపై జీఎస్టీ విధించబోమని తెలిపారు. ప్రింటర్ నుండి బ్యాంక్ కొనుగోలు చేసిన చెక్ బుక్‌పై మాత్రమే జీఎస్టీ పన్ను విధిస్తున్నామని ఆమె ప్రకటించారు. ముందుగా ప్యాక్ చేసిన, లేబుల్ చేయబడిన ఆహార పదార్థాలపై 5 శాతం జీఎస్టీ విధించాలన్న ప్రతిపాదనకు జీఎస్టీ కౌన్సిల్‌లోని అన్ని రాష్ట్రాల అమోదంతోనే అంగీకరించమని గుర్తుచేశారు. ఆహార పదార్థాల పై జీఎస్టీ పన్ను విధించాలనే ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఒక్కరు కూడా మాట్లాడలేదని ఆర్థిక మంత్రి తెలిపారు. హాస్పిటల్ బెడ్‌లు లేదా ఐసీయూపై జీఎస్టీ లేదని తెలిపిన మంత్రి…. రోజుకు రూ. 5000 అద్దె ఉన్న గదులపై మాత్రమే పన్ను విధించబడుతుందని ఆమె తెలిపారు. పేదలు ఏ ఆహార పదార్థాన్ని వినియోగించినా పన్ను విధించబోమన్నారు. వదులుగా ఉండే వివిధ పరిమాణంలో విక్రయించే వాటిపై జీఎస్టీ ఉండదని సీతారామన్ వివరించారు. ప్రతి రాష్ట్రం తృణధాన్యాలు, పప్పులు, పెరుగు, లస్సీ మరియు మజ్జిగ, ఇతర ఆహార పదార్థాలపై పన్ను విధించిందని ఆర్థిక మంత్రి ….ఆహార పదార్థాలపై జీఎస్టీ విధించడాన్ని సమర్థించారు.

- Advertisement -