నోట్ల రద్దుతో ఆర్ధిక వ్యవస్థ పతనం:రాహుల్ గాంధీ

184
rahul gandhi
- Advertisement -

నోట్ల రద్దుతో దేశ ఆర్ధిక వ్యవస్థ పతనమైందని ఆరోపించారు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. పాతనోట్ల రద్దు చేసి నేటికి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా మాట్లాడిన రాహుల్ గాంధీ…నాలుగేళ్లక్రితం ప్ర‌ధాని మోదీ ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల కోసం కాకుండా త‌న కొందిమంది మిత్ర పెట్టుబ‌డిదారులకు స‌హాయం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా నోట్ల ర‌ద్దును చేప‌ట్టార‌ని విమర్శించారు.

ప్రధాని తీసుకున్న చర్యల వల్ల భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థపై ప్ర‌తికూల ప్ర‌భావాల‌ను చూపింద‌న్నారు. రైతుల‌ను, కార్మికులను, చిన్న దుకాణదారులను బాధపెట్టాడు. ఈ చ‌ర్య వ‌ల్ల‌ ఆర్థిక వ్యవస్థ రెండు శాతం నష్టపోతుందని మన్మోహన్ సింగ్ ఆనాడే చెప్పారు….ఇప్పుడు అదే నిజమవుతుందన్నారు.

ప్ర‌జ‌లు బ్యాంకులో డ‌బ్బులు దాచుకుంటే అవి తీసుకుపోయి ప్ర‌ధాని మోదీ త‌న ఇద్ద‌రు, ముగ్గురు పెట్టుబ‌డిదారుల‌కు ఇచ్చార‌న్నారు. వారికి ప్ర‌యోజ‌నం చేకూరేలా రూ.3,50,000 కోట్ల రుణ‌మాఫీ చేశార‌న్నారు. కొత్త వ్యవసాయ చట్టాలతో ఇప్పుడు రైతులను లక్ష్యంగా చేసుకున్నార‌ని విమర్శించారు.

- Advertisement -