భారత ఆర్థిక వృద్ధి రేటు గణనీయంగా తగ్గింది:ఐఎంఎఫ్‌

151
- Advertisement -

భారత్‌ వృద్ధిరేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను కోత విధిస్తున్నట్టు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ప్రకటించింది. గతంలో ఉన్న అంచనాతో పోలిస్తే 60బేసిక్‌ పాయింట్లు తగ్గించినట్టు తెలిపింది. దీంతో ఆర్థిక వృద్ధి రేటు 6.8శాతానికి పరిమితం చేసింది. అంతర్జాతీయ డిమాండ్‌ లేకపోవడంతో రెండో త్రైమాసికం వృద్ధిరేటు మందగించిందని తన రిపోర్టులో పేర్కొంది. గత త్రైమాసికంలో 80బేసిక్‌ పాయింట్లు తగ్గించిన వృద్దిరేటు 7.4శాతంగా ఉందని ప్రకటించింది.

ప్రపంచ వృద్ధిరేటు ఈ ఏడాది 3.2 శాతంగా కొన‌సాగినా.. 2023లో 2.7 శాతానికి, రెండు శాతం కంటే త‌క్కువ‌కు ప‌డిపోవ‌చ్చున‌ని ఐఎంఎఫ్ హెచ్చ‌రించింది. ఐఎంఎఫ్‌తోపాటు భార‌తీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ), వ‌ర‌ల్డ్ బ్యాంక్ త‌దిత‌ర ఆర్థిక సంస్థ‌లు కూడా ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌ర భార‌త్ వృద్ధిరేటులో కోత విధించాయి. అయితే 2023-24 ఆర్థిక సంవ‌త్స‌రంలో భార‌త్ జీడీపీ 6.1 శాతం య‌థాత‌థంగా కొన‌సాగుతుంద‌ని ఐఎంఎఫ్ ప్ర‌క‌టించింది.

ఇంత‌కుముందు భార‌త్ వృద్ధిరేటు 7.5 శాతం ఉంటుంద‌ని పేర్కొన్న‌ ఎస్బీఐ.. ఇటీవ‌ల 6.8 శాతానికి ప‌రిమితం చేసింది. ప్ర‌పంచ బ్యాంక్ 7.5 శాతం నుంచి 6.5 శాతానికి కుదించింది. ఏషియ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ బ్యాంక్ 7.2 నుంచి ఏడు శాతానికి, ఆర్బీఐ 7.2 నుంచి ఏడు శాతానికి ప‌రిమితం చేశాయి.

2022 కంటే 2023లో ప‌లు ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల (ప‌లు దేశాలు) ప‌రిస్థితి దారుణంగా ఉంటుంద‌ని ఐఎంఎఫ్ హెచ్చ‌రించింది. ద్ర‌వ్య ల‌భ్య‌త క‌ఠిన‌త‌రం కొన‌సాగాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసింది. 2022లో గ్లోబ‌ల్ ద్ర‌వ్యోల్బ‌ణం 8.8 శాతానికి దూసుకెళ్తుంద‌ని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది.

- Advertisement -