దేశమంతా సుపరిపాలనే.. కే‌సీఆర్ లక్ష్యం!

11
- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఆరంగేట్రం చేసిన తరువాత దేశ వ్యాప్తంగా బి‌ఆర్‌ఎస్ ను విస్తరించే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఇప్పటికే బి‌ఆర్‌ఎస్ కు అన్నీ వైపులా నుంచి ప్రజా మద్దతు భారీగా లభిస్తోంది. వివిధ రాష్ట్రాలకు చెందిన కీలక నేతలు కూడా బి‌ఆర్‌ఎస్ లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ఏపీ, కర్నాటక, మహారాష్ట్ర రాష్ట్రాలలో బి‌ఆర్‌ఎస్ మెల్లగా పరిధిని పెంచుకుంటూ అక్కటి స్థానిక పార్టీలకు కూడా గట్టి షాక్ ఇస్తోంది. ఇక ఇటీవల మహారాష్ట్రలోని నాందేడ్ లో బి‌ఆర్‌ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించగా ఈ సభకు భారీగా ప్రజామద్దతు లభించింది. బహిరంగ సభలో కే‌సి‌ఆర్ చేసిన ప్రసంగానికి దేశ వ్యాప్తంగా ప్రశంశల జల్లు కురుస్తోంది.

దేశంలో మార్పు కోసమే టి‌ఆర్‌ఎస్ ను బి‌ఆర్‌ఎస్ గా మార్చమని, వచ్చే ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ కు అధికారం ఇస్తే రెండేళ్లలోనే దేశ వ్యాప్తంగా ఉచిత కరెంట్, అలాగే తెలంగాణలో అమలౌతున్న రైతు బంధు, దళిత బంధు వంటి పథకాలను దేశ వ్యాప్తంగా ప్రవేశ పెడతామని కే‌సి‌ఆర్ హామీ ఇచ్చారు. బి‌ఆర్‌ఎస్ ది రాజకీయ పోరాటం కాదని, జీవన్మరణ పోరాటం అని కే‌సి‌ఆర్ చెప్పుకొచ్చారు. బి‌ఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే మహిళలకు 33 శాతం రిజర్వేషన్స్ కల్పిస్తామని, తెలంగాణ మాదిరిగానే దేశ వ్యాప్తంగా సుపరిపాలన అందించడమే బి‌ఆర్‌ఎస్ లక్ష్యం అంటూ కే‌సి‌ఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికే తెలంగాణను అటు సంక్షేమంలోనూ ఇటు అభివృద్దిలోనూ దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టిన కే‌సి‌ఆర్.. దేశంలో అధికారంలోకి వస్తే దేశం మరింత అభివృద్ది పథంలో దూసుకుపోవడం ఖాయమానేది ప్రజాభిప్రాయం. బి‌ఆర్‌ఎస్ దూకుడు ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ వంటి పార్టీలకు ప్రజలు చెక్ పెట్టె అవకాశాలు కనిపిస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇవి కూడా చదవండి…

దేశంలో గుణాత్మక మార్పు తెస్తాం: సీఎం కేసీఆర్

రూ.2,90,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్..

ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా బడ్జెట్:హరీశ్

- Advertisement -