దేశంలో రికార్డు స్ధాయిలో కరోనా..

93
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోయింది. రికార్డు స్ధాయిలో కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 2,82, 970 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 441 మంది మరణించారు. కరోనా నుండి గత 24 గంటల్లో 1,88,157 మంది కోలుకోగా ప్రస్తుతం దేశంలో 18,31,000 యాక్టివ్ కేసులున్నాయి.

దేశంలో పాజిటివిటీ రేటు 15.13 శాతంగా ఉండగా ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,79,01,241కి చేరింది.కరోనాతో ఇప్పటివరకు 4,87,202 మంది మృతిచెందారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 158,88,47,554 వ్యాక్సిన్ డోసులను అధికారులు పంపిణీ చేశారు. దేశంలో ఓమిక్రాన్ కేసుల సంఖ్య 8,961కి చేరింది.

- Advertisement -