- Advertisement -
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 97 లక్షలకు చేరువయ్యాయి. గత 24 గంటల్లో 36,011 కరోనా కేసులు నమోదుకాగా 482 మంది మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 96,44,222కు చేరింది.
ప్రస్తుతం దేశంలో 4,03,248 యాక్టివ్ కేసులుండగా 91,00,792 మంది బాధితులు కరోనా నుండి కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనాతో 1,40,182 మంది మృతిచెందారు. దేశంలో అత్యధిక కరోనా కేసులతో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. ఇప్పటివరకు మహారాష్ట్రలో 18,47,509 కరోనా కేసులు నమోదుకాగా తర్వాతి స్ధానాల్లో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ ఉన్నాయి.
- Advertisement -