బిగ్ బాస్ 4…ఎపిసోడ్ 91 హైలైట్స్

215
episode 91
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 91 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 91వ ఎపిసోడ్‌లో భాగంగా రేస్ టూ ఫినాలేకు అర్హత సాధించిన తొలి ఇంటి సభ్యుడిగా అఖిల్ నిలవడం, ఇంటి సభ్యుల ఎమోషన్‌ను తీర్చేసి అందరిని ఖుష్ చేశారు నాగార్జున.

తొలుత అఖిల్-మోనాల్‌లు ఎప్పటిలాగానే ముచ్చట్లలో నిమగ్నంకాగా నీ వల్ల నేనే ఇలా అయ్యానని అఖిల్ అంటే.. నేను చాలా ఇన్నోసెంట్ అంటూ తెగ సిగ్గు పడింది మోనాల్. తర్వాత సొహైల్‌-అరియానా కలిసి మోనాల్‌ని ఏడిపించే ప్రయత్నం చేశారు. ఇక అరియానా అయితే అఖిల్ తనని బయటకు వెళ్లిన తరువాత కూడా టచ్‌లో ఉందాం అని అన్నాడని.. పెళ్లి చేసుకుంటా.. మొదట్లోనే నిన్ను చూసి ఉంటే బాగుండేదని అన్నాడని చెప్పగా అఖిల్ అందరిని కవర్ చేస్తున్నారని తెలిపి పంచ్ ఇచ్చాడు సొహైల్.

వరస్ట్ పెర్ఫామర్ ఆఫ్ ది సీజన్‌గా ఎంపికైన అభిజిత్ జైలు శిక్షా కాలం ముగియగా తర్వాత ఎంటీఆర్ మసాల వంటల పోటీని పెట్టారు బిగ్ బాస్. ఇంటి సభ్యుల్ని రెండు టీంలుగా విడగొట్టి ఎంటీఆర్ మసాలా ఉపయోగించి వివిధ రకాల వంటలు చేయాలని తెలిపారు. ఆ టాస్క్‌లో అభిజిత్, హారిక, అవినాష్‌లు ఒక టీం కాగా.. అఖిల్, అరియానా, మోనాల్‌లు ఒక టీంగా ఉన్నారు. అయితే ఇద్దరు వంటలని రుచి చూసిన సొహైల్ ఇద్దరిని విజేతలుగా ప్రకటించారు.

తర్వాత లగ్జరీ బడ్జెట్ టాస్క్ భాగంగా.. వివిధ లగ్జరీ బడ్జెట్ ఐటమ్స్ కలిగి ఉన్న బాక్స్‌లు గార్డెన్ ఏరియాలో ఉంచి ఇంటి సభ్యుల్లో ఎవరైనా ఇద్దరు ఒకరు కళ్లకు గంతలు కట్టుకుని మరొకరు వారికి సూచనలు ఇవ్వాలని తెలిపారు. అభి-అఖిల్ ముందుకురాగా ఇంటి సభ్యులకు కావాల్సిన ఐటమ్స్‌ని తీసుకురావడంలో సక్సెస్ అయ్యాడు అభి.

తర్వాత అవినాష్-అరియానా సరదగా మాట్లాడుకుంటూ ఐ లవ్ మై సెల్ఫ్.. నేనంటే నాకు పిచ్చి అని తెలపగా అవినాష్ ఏమంటాడో అని అభిజిత్ అనగా..ఇట్లాంటి లాజిక్‌లు అవినాష్‌కి అర్థంకావు పాపం అంటూ జోక్‌గా అంది. అంతే ఈ మాటలు విన్న అవినాష్‌…అరియానాపై సీరియస్ అయ్యాడు.దీంతో అవినాష్‌- అరియానా మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఎంటరైన నాగ్…ఇంటి సభ్యుల చిప్ దొబ్బింది అంటూ చురకలు అంటించారు.

హౌస్‌లో ఉన్న ఇంటి సభ్యులంతా చాలా గరమ్ గరమ్‌లో ఉంటున్నారు ఎందుకు?? ఎందుకంత కోపం వస్తోందని ఫస్ట్రేషన్ స్టార్ అవినాష్‌తో మొదలుపెట్టారు. కన్ఫెషన్ రూంలోకి వచ్చిన అవినాష్..నా బాధ ఏంటంటే సార్.. టైం దగ్గర పడుతోంది.. మీరు ప్రతి మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.. ఒక్క మాట చాలు మీ ఓటింగ్‌ని మార్చేయడానికి అన్న మాట నా మైండ్‌లో బాగా ఫిక్స్ అయిపోయింది సార్ అని తెలపగా అవినాష్ సందేహాలకు క్లారిటీ ఇస్తూ మోనాల్‌తో సారీ చెప్పించారు నాగ్. దీంతో అవినాష్‌ హ్యాపీగా ఫీలయ్యాడు.

తర్వాత కన్ఫెషన్ రూంలో మోనాల్‌ సందేహాలకు,అభిజిత్ సందేహాలకు క్లారిటీ ఇవ్వగా వారు హ్యాపీగా ఫీలయ్యారు. ఇక టికెట్ టు ఫినాలే మెడల్ సాధించిన అఖిల్‌కి సొహైల్ ద్వారా మెడల్ అందించారు. అయితే ఈ మెడల్ సాధించాలి అంటే నామినేషన్స్ నుంచి సేవ్ అవ్వాలి అంటూ ట్వీస్ట్ ఇస్తూ తొలుత అఖిల్‌ని సేవ్ చేశారు. దీంతో ఇంటి సభ్యులంతా హ్యాపీగా ఫీలయ్యారు.

- Advertisement -