దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి వేలసంఖ్యలో నమోదవుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో రికార్డు స్ధాయిలో 24,850 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,73,165కి చేరగా గత 24 గంటల్లో 613 మంది మృతిచెందారు.
ప్రస్తుతం దేశంలో యాక్టివ్ పాజిటివ్ కేసుల సంఖ్య 2,44,814గా ఉండగా ఇప్పటివరకు కరోనా మహమ్మారి నుండి 4,09,083 మంది కోలుకున్నారు. వైరస్ వల్ల మరణించినవారి సంఖ్య 19,268కి పెరిగింది.
దేశంలో జూలై 4 వరకు 97,89,066 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని…శనివారం ఒక్కరోజే 2,48,934 నమూనాలను పరీక్షించామని తెలిపింది ఐసీఎంఆర్.
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న దేశాల్లో మూడో స్థానంలో ఉన్న రష్యాకు భారత్ మరింత చేరువయ్యింది. రష్యాలో ప్రస్తుతం 6,74,515 పాజిటివ్ కేసులు ఉండగా, భారత్‌లో 6,73,165 కరోనా కేసులు ఉన్నాయి.