దేశంలో కరోనా మహమ్మారి విజృంభన కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో కరోనాబారినపడి 410 మృతిచెందగా అత్యధికంగా 19,906 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.ఇప్పటివరకు దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,28,859కు చేరగా ప్రస్తుతం 2,03,051 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఇప్పటివరకు కరోనా నుండి 3,09,713 మంది కొలుకోగా 16,095 మంది మృతిచెందారు . దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల్లో 85.5 శాతం, ఇప్పటివరకు నమోదైన మరణాల్లో 87% కేవలం ఎనిమిది రాష్ట్రాల్లోనే ఉంది. మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్ ,తెలంగాణ, ఉత్తర్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్‌లో ఉన్నాయని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఒక కోటి 80 వేల 224 మంది ఈ వైరస్ భారిన పడ్డారు. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 41 లక్షల 21 వేల 17. వ్యాధి నుంచి కోలుకుని 54 లక్షల 57 వేల 945 మంది డిశ్చార్జ్ అయ్యారు.