4 లక్షలకు చేరువలో కరోనా కేసులు..

244
india coronavirus cases
- Advertisement -

దేశంలో రోజురోజుకి పెరిగిపోతున్న కరోనా కేసులతో ప్రజలు తీవ్ర ఆందోళనకు చెందుతున్నారు. రోజుకు 10 వేలకు పైగా కేసులు నమోదవుతుండటంతో పాటు మరణాల సంఖ్య కూడా పెరిగిపోతూనే ఉంది.

ఇక తాజాగా గత 24 గంటల్లో కొత్తగా 14,516 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 4 లక్షలకు చేరువ కాగా వరుసగా 9వ రోజూ 10వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.

ఇప్పటివరకు 3,95,048 కేసులు నమోదుకాగా 375 మంది మృత్యువాత పడ్డారు. ఇక దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,68,269గా ఉండగా ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకొని 2,13,831 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. 12,948 మంది మృత్యువాతపడ్డారు.

- Advertisement -