దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి వేల సంఖ్యలో పెరిగిపోతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 15,968 పాజిటివ్ కేసులు నమోదుకాగా 465 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు 4,56,183 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 14,476 మంది మృతిచెందారు.
దేశవ్యాప్తంగా నిన్నటివరకు 73,52,911 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని ఐసీఎంఆర్ ప్రకటించింది. గత 24 గంటల్లో 2,15,195 మందికి పరీక్షలు నిర్వహించామని, 15,968 మంది పాజిటివ్‌లుగా నిర్ధారణ అయ్యారని తెలిపింది.
ఇక దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,83,022 ఉండగా ఇప్పటివరకు 2,58,685 కరోనా మహమ్మారి నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక దేశంలో మహారాష్ట్ర కరోనా కేసుల్లో అగ్రస్ధానంలో కొనసాగుతూనే ఉంది. 1,39,010 పాజిటివ్ కేసులు నమోదుకాగా గత 24 గంటల్లో 3214 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 66,602 కేసులు నమోదుకాగా మృతులు 2,301 మంది మృతిచెందారు.