హ్యాపీ బర్త్ డే…రాములమ్మ

428
vijayashanthi
- Advertisement -

‘నేటి భారతం’, ‘ప్రతిఘటన’, ‘కర్తవ్యం’, ‘ఒసేయ్‌ రాములమ్మ’ వంటి చిత్రాలతో సంచలనం సృష్టించిన జాతీయ ఉత్తమ నటి, లేడీ అమితాబ్‌ విజయశాంతి. వెండితెరపై తన తిరుగులేని నటనతో ప్రేక్షకాదరణ పొందిన రాములమ్మ….రాజకీయాల్లో సైతం ఫైర్ బ్రాండ్‌గా ఇమేజ్ సంపాదించుకుంది. ఇవాళ విజయశాంతి బర్త్ డే.

7వ ఏటనే బాలనటిగా సినిమా రంగంలోకి ప్రవేశించింది విజయశాంతి. ఇక రాములమ్మను వెండితెరకు హీరోయిన్‌గా పరిచయం చేసింది భారతీరాజా. 1979లో వచ్చిన తమిళ సినిమా కల్లుక్కుళ్ ఈరమ్ (రాళ్లకూ కన్నీరొస్తాయి) కథానాయికగా విజయశాంతి మొదటి సినిమా.తెలుగులో రాములమ్మ తొలిచిత్రం కిలాడి కృష్ణుడు.

తన 41 సంవత్సరాల సినీ ప్రస్ధానంలో సుమారు 180 సినిమాలకు పైగా నటించింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషా చిత్రాలలో నటించింది. 1991 లో వచ్చిన కర్తవ్యం సినిమాకు గానూ జాతీయ సినిమా ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకుంది.

ఏడుసార్లు దక్షిణాది ఫిలిం ఫేర్ పురస్కారాలను, ఆరు సార్లు ఉత్తమ నటి పురస్కారాన్ని, 2003లో దక్షిణ భారతదేశ ఫిలింఫేర్ లైఫ్ టైం అఛీవ్‌మెంటు పురస్కారాన్ని పొందింది. నాలుగు సార్లు నంది అవార్డులను అందుకుంది. వెండితెరపై ఎవర్ గ్రీన్ హిట్ పెయిర్ చిరంజీవి- విజయశాంతిది.

1998లో రాజకీయాల్లోకి ప్రవేశించిన విజయశాంతి తల్లి తెలంగాణ పార్టీని స్ధాపించారు. తర్వాత తన పార్టీని టీఆర్ఎస్‌లో వీలినం చేశారు. 2009లో మెదక్ ఎంపీగా గెలుపొందిన రాములమ్మ…ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీరోల్ పోషించారు. 2014 ఎన్నికలకు ముందుకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్నారు.

దాదాపు దశాబ్దకాలం తర్వత మహేశ్ బాబు హీరోగా తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరుతో వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చింది విజయశాంతి. భారతిగా తన నటనతో ఆకట్టుకున్న విజయశాంతి మరెన్నో సినిమాల్లో నటించి మెప్పించాలని greattelangaana.com మనస్పూర్తిగా కొరుకుంటోంది.

- Advertisement -