- Advertisement -
దేశంలో కరోనా మహమ్మారి విజృంభన కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో రికార్డు స్ధాయిలో 12,881 కేసులు నమోదుకాగా 334 మంది మృతిచెందారు. ఒక్క రోజులో ఇంత పెద్ద మొత్తంలో కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి.
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,66,946కు చేరగా 1,60,384ల యాక్టివ్ కేసులున్నాయి. 1,94,324 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యశాఖ అధికారులు సూచిస్తున్నారు.
ఇక దేశంలోనే కరోనా పాజిటివ్ కేసుల్లో అగ్రస్ధానంలో ఉన్న మహారాష్ట్రలో కరోనా మహమ్మారి పంజా విసురుతూనే ఉంది. ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని, లేదంటే వైరస్ బారిన పడాల్సి వస్తుందని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి.
- Advertisement -