ఒక్కరోజే 10667 కేసులు…380 మంది మృతి

264
coronavirus
- Advertisement -

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,43,091కి చేరుకున్నాయి. గత 24 గంటల్లో 10667 కొత్త కేసులు నమోదుకాగా 380 మంది మృతిచెందారు. రెండు రోజుల నుండి రోజుకు 11 వేల కేసులు నమోదవుతుండగా తాజాగా 10 వేల మార్క్‌కి కరోనా కేసులు చేరుకున్నాయి.

దేశంలో ప్రస్తుతం 1,53,178 యాక్టివ్ కేసులు ఉండగా 1,80,013 మంది కరోనా నుండి కొలుకోని డిశ్చార్జ్ అయ్యారు. ఇక దేశంలో ఇప్పటివరకు 9900 మంది మృతిచెందారు.

ప‌్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ క‌రాళ నృత్యం కొన‌సాగుతూనే ఉన్న‌ది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 78 ల‌క్ష‌లు, మ‌ర‌ణాల సంఖ్య 4 ల‌క్ష‌ల 31 వేలు దాటింది. అగ్ర‌రాజ్యం అమెరికాలోనే అత్యధిక కేసులు న‌మోద‌వుతున్నాయి. ఇప్ప‌టికే 37 ల‌క్ష‌లకుపైగా పాజిటివ్ కేసుల‌తో క‌రోనా మ‌హ‌మ్మారికి ప్ర‌ధాన కేంద్రంగా ఆ దేశం కొన‌సాగుతున్న‌ది.

- Advertisement -