- Advertisement -
దేశంలో కరోనా వైరస్ పంజా విసురుతూనే ఉంది. రోజుకు 60 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతుండటంతో పాజిటివ్ కేసుల సంఖ్య 24 లక్షలు దాటాయి. గత 24 గంటల్లో 66,999 పాజిటివ్ కేసులు నమోదవగా, 942 మంది మరణించారు.
దేశంలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 23,96,638కి చేరగా 47,033 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దేశంలో 6,53,622 యాక్టివ్ కేసులుండగా 16,95,982 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకోని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో కరోనా రికవరీ రేటు 70 శాతంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
ఆగస్టు 12 వరకు 2,68,45,688 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా నిన్న ఒక్కరోజే 8,30,391 నమూనాలను పరీక్షించామని ఐసీఎమ్మార్ తెలిపింది.
- Advertisement -