భారీవర్షం..కాళేశ్వరం వద్ద పెరిగిన వరద ఉదృతి

150
godavari river
- Advertisement -

ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి నది ఉదృతంగా ప్రవహిస్తోంది. ముఖ్యంగా గోదావరి పరివాహాక ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా ఉప నదులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఫలితంగా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది.

భారీ వర్షాలకు ప్రాణహితలో వరద ఉధృతి పెరగడంతో కాళేశ్వరం వద్ద గోదావరి నది 8.21 మీటర్ల ఎత్తున ప్రవహిస్తుంది.మహాదేవపూర్ మండలం మెడిగడ్డ వద్ద గోదావరి నది పై నిర్మించిన లక్ష్మీ బ్యారేజ్ కి గోదావరి ఉధృతి పెరగడంతో 3,76,000 క్యూసెక్కుల వరద నీరు లక్ష్మీ జలాశయం లోకి వచ్చి చేరడంతో 57తలుపులు తెరిచి 3,99, 300 క్యూసెక్కుల జలాలు అధికారులు దిగువకు వదులుతున్నారు.

లక్ష్మీ బ్యారేజ్ పూర్తి స్థాయి నీటి మట్టం 100 మీటర్లు.ప్రస్తుతం స్థాయి నీటి మట్టం 97.50 మీటర్లు,పూర్తి స్థాయి నీటి నిల్వ 16.17 టిఎంసీలు కాగా ప్రస్తుత స్ధాయి నీటి నిల్వ 9.166టిఎం సీలు.

- Advertisement -