2 లక్షల 7 వేలకు చేరిన కరోనా కేసులు..

271
love aggarwal
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. గత 14 రోజుల్లో లక్షకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల 7వేలకు చేరాయి.

గత 24 గంటల్లో కరోనాతో 217 మంది ప్రాణాలు కోల్పోగా, కొత్తగా 8,909 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పటివరకు కరోనాతో 5,815 మంది కరోనాతో చనిపోగా 1,00,303 మంది ఈ వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల రేటు 6.13 శాతం ఉండగా.. మనదేశంలో ఇది 2.82 శాతం మాత్రమేనని ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు.

రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే మహారాష్ట్రలో అత్యధికంగా 72,300 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 2,465 మంది మృతి చెందారు. తమిళనాడులో 24,586, ఢిల్లీలో 22,132, గుజరాత్‌లో 17,632, రాజస్థాన్‌లో 9,373, యూపీలో 8,729, మధ్యప్రదేశ్‌లో 8,420, పశ్చిమ బెంగాల్‌లో 6,168, బీహార్‌లో 4,096, కర్ణాటకలో 3,796, ఏపీలో 3,791, తెలంగాణలో 2,891 కేసులు నమోదయ్యాయి.

- Advertisement -