- Advertisement -
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో 24,879 పాజిటివ్ కేసులు నమోదుకాగా 87 మంది మృత్యువాతపడ్డారు.
ఇక దేశంలో ప్రస్తుతం 7,67,296 పాజిటివ్ కేసులు ఉండగా యాక్టివ్ కేసులు 269789 ఉన్నాయి. వైరస్ నుంచి 476378 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 21129 మంది మృత్యువాతపడ్డారు.
దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండగా తర్వాతి స్ధానంలో తమిళనాడు, ఢిల్లీ ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా మహమ్మారి కేసులు రోజురోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం టీటీడీలో 80 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు పలుచోట్ల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని అధికారులు వెల్లడించారు
- Advertisement -