ఉజ్జయినిలో మోస్ట్ వాంటెడ్ వికాస్ దూబే అరెస్ట్..

228
vikas dube
- Advertisement -

ఎట్టకేలకు యూపీ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ వికాస్ దూబె అరెస్టయ్యాడు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో వికాస్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వికాస్‌ని గుర్తించిన ఓ గార్డు అతడిని బంధించి పోలీసులకు సమాచారం అందివ్వగా అతడిని అరెస్ట్ చేశారు పోలీసులు. వికాస్‌ తలపై రూ. 5 లక్షల రివార్డు ఉంది.

ఇటీవలె కాన్పూర్‌లో జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో 8 మంది పోలీసులు మృతిచెందిన విష‌యం తెలిసిందే. ఆ కేసులో వికాస్ ప్ర‌ధాన నిందితుడు. అప్పటినుండి ఓ వైపు వికాస్‌ కోసం గాలిస్తూనే మరోవైపు అతడి ప్రధాన అనుచరులను ఎన్‌కౌంటర్ చేస్తూ వస్తున్నారు పోలీసులు.

ఒక్కొక్కరిగా వికాస్‌ ముఠా సభ్యులను మట్టుబెట్టారు పోలీసులు. వికాస్‌ దూబే ప్రధాన సహాయకుడు అమర్‌ దూబేతో పాటు సన్నిహితుడు రణబీర్‌ అలియాస్‌ బబ్బన్‌ శుక్లాను, మరో అనుచరుడు కార్తికేయను ఎన్‌కౌంటర్‌ చేశారు పోలీసులు. మొత్తంగా వికాస్ దూబే అరెస్ట్‌తో ఆపరేషన్‌ ముగిసింది.

- Advertisement -