23 లక్షలకు చేరువలో కరోనా కేసులు..

174
coronavirus
- Advertisement -

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 23 లక్షలకు చేరువయ్యాయి. గత 24 గంటల్లో 53,061 పాజిటివ్ కేసులు నమోదుకాగా 871 మంది మృత్యువాతపడ్డారు.

దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా వైర‌స్ కేసుల సంఖ్య 22,68,676కు చేరుకోగా మరణాల సంఖ్య 50 వేలకు చేరువయ్యాయి.ప్రస్తుతం 6,39,929 యాక్టివ్ కేసులుండగా 15,83,490 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు.

దేశంలో కరోనా మరణాల రేటు 1.99గా ఉండగా ప్ర‌స్తుతం యాక్టివ్ కేసులు 28.21 శాతం ఉందని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 69.80 శాతం మంది వైర‌స్ నుంచి కోలుకున్నారని బెంగాల్‌లో అత్య‌ధికంగా మూడు వేల పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.

- Advertisement -