- Advertisement -
దేశంలో ఓ వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుండగా మరోవైపు కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 47,262 కేసులు నమోదు కాగా 275 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,17,34,058కి చేరింది.
ప్రస్తుతం దేశంలో 3,68,467 యాక్టివ్ కేసులుండగా 1,12,05,160 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,60,441 కి చేరింది. డిశ్చార్జ్ కేసుల కంటే పాజిటివ్ కేసులు డబుల్ గా నమోదవుతుండటం అందరిని ఆందోళన కలిగిస్తోంది.
- Advertisement -