దేశంలో 23 లక్షలు దాటిన కరోనా కేసులు…

147
corona
- Advertisement -

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది.రోజుకు 60 వేలకు పైగా కరోనా కేసులు నమోదువుతుండటం అందరిని ఆందోళనకు గురిచేస్తుండగా ఇప్పటివరకు కేసుల సంఖ్య 23 లక్షలు దాటాయి.

గత గడిచిన 24 గంటల్లో భారత్‌లో 60,963 కేసులు నమోదు కాగా, 834 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు కరోనాతో 46,091 మంది మరణించగా దేశంలో కరోనా రికవరీ రేటు 70.38 శాతంగా ఉంది.

ఇక ఇప్పటివరకు 23,29,638 కేసులు నమోదుకాగా 6,43,948 యాక్టవ్ కేసులున్నాయి. కరోనా మహమ్మారి నుండి 13,39,599 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు.

దేశంలో ఇప్పటివరకు 2,60,15,297 కరోనా టెస్టులు చేశామని తెలిపిన ఐసీఎంఆర్ గత 24 గంటల్లో 7,33,449 పరీక్షలు చేసినట్లు వెల్లడించింది.

- Advertisement -