24 గంటల్లో 1897 కరోనా కేసులు..

149
ap corona cases
- Advertisement -

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 85 వేలకు చేరువయ్యాయి. గత 24గంటల్లో 1,897 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 9 మంది మృత్యువాతపడ్డారు.

ఇక ఇప్పటివరకు తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 84,544కి చేరగా ప్రస్తుతం తెలంగాణలో22,596 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనాతో 654 మంది మృతిచెందగా కరోనా మహమ్మారి నుండి 61,294 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

గత 24 గంటల్లో నమోదైన వివరాలను పరిశీలిస్తే జీహెచ్‌ఎంసీ పరిధిలో 479 కేసులు ఉండగా, రంగారెడ్డిలో 162, సంగారెడ్డిలో 107 కేసులు అత్యధికంగా నిర్ధారణ అయ్యాయి. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 72.49 శాతంగా ఉండగా మరణాల రేటు 0.77గా ఉంది.

- Advertisement -