దేశంలో కరోనా హాట్ స్పాట్ రాష్ట్రాలివే..

252
corona in ts
- Advertisement -

దేశంలో కరోనా వైరస్ రోజురోజుకి విస్తరిస్తోంది. ఇప్పటికే దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,289 కి చేరింది. ఇప్పటివరకు దేశంలో 118 మంది మృతి చెందగా, 328 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

దేశంలో వేగంగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల ఆధారంగా 11 రాష్ట్రాలను కరోనా హాట్ స్పాట్లుగా ప్రకటించింది కేంద్రం. వీటిలో మహారాష్ట్ర ,తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ,కేరళ, తమిళనాడు,ఢిల్లీ , ఉత్తర ప్రదేశ్ ,మధ్యప్రదేశ్, రాజస్థాన్ ,గుజరాత్, కర్నాటక రాష్ట్రాలున్నాయి. వైరస్ తీవ్రంగా వ్యాపించిన ప్రాంతాల్లో కేసుల సంఖ్య పూర్తిగా నిలిచిపోయే వరకూ కఠినంగా వ్యవ హరించాలని కేంద్ర సర్కారు నిర్ణయించింది.

మహారాష్ట్రలో 748 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 45 మంది మృతి చెందారు. తమిళనాడులో 571 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఐదుగురు మృతి చెందారు. ఢిల్లీలో 503 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఏడుగురు మృతి చెందారు.తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 334కు చేరింది. ఆస్పత్రుల్లో 289 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.

- Advertisement -