43 లక్షలు దాటిన కరోనా కేసులు…

226
corona
- Advertisement -

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో 89,706 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా రికార్డు స్ధాయిలో 1115 మంది మృతిచెందారు.

ప్రస్తుతం దేశంలో యాక్టివ్ పాజిటివ్‌ కేసుల సంఖ్య 43,70,129గా ఉండగా 73,890 మంది కరోనా వైరస్‌తో మృతిచెందారు. ఇప్పటివరకు 33,98,845 మంది కరోనా నుండి కోలుకోగా 8,97,394 యాక్టివ్‌ కేసులున్నాయి.

ఇప్పటివరకు దేశంలో 5,18,04,677 శాంపిల్స్ టెస్టు చేయగా గత 24 గంటల్లో 11,54,549 మంది కరోనా టెస్టులు చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.

- Advertisement -