అంతా అనుకున్నట్లే వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌ను భారత్ 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. తొలి టెస్టులో ఇన్నింగ్స్ 272 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన టీమ్‌ఇండియా.. రెండో టెస్టులో 10 వికెట్ల తేడాతో గెలిచింది.భారత గెలుపులో ఓపెనర్ పృథ్వీ షా ,ఉమేశ్ యాదవ్ కీలక పాత్ర పోషించారు. ఉమేశ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ లభించగా పృథ్వీ షాకి ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు లభించింది.
ఈ నేపథ్యంలో షాపై ప్రశంసలు గుప్పించారు టీమిండియా కోచ్ రవిశాస్త్రి. పృథ్వీ షాలో సచిన్,సెహ్వాగ్,లారాలు కనిపిస్తున్నారని అన్నారు. అతనిలో కష్టపడే తత్వం కనిపిస్తుందని..కెరీర్ తొలినాళ్లలోనే వచ్చిన కిక్కును తలకెక్కించుకోకుంటే మంచి భవిష్యత్ ఉంటుందని సూచించారు.
షా ఆడే షాట్లలో ఒక్కొసారి సచిన్…ఒక్కోసారి సెహ్వాగ్,లారాలు కనిపిస్తున్నారని తెలిపారు. ఒకే టెస్టుల్లో 10 వికెట్లు తీసిన జాబితాలో దిగ్గజాలైన కపిల్ దేవ్, శ్రీనాథ్‌ల సరసన నిలిచిన ఉమేశ్ యాదవ్‌ను ప్రశంసలతో ముంచెత్తాడు.
జట్టుకు తాను విలువైన బౌలర్‌నని ఉమేశ్ చాటుకున్నాడని తెలిపారు. శార్దుల్ ఓ సెషన్‌లో దూరమైతే ఉమేశ్ ఆ స్థానాన్నీ భర్తీ చేశాడని, పది వికెట్లు తీయగలిగాడని దీంతో జట్టు ఏ ఒక్కరిమీద ఆధారపడలేదనే విషయం స్పష్టమవుతుందన్నారు.