భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా.. స్వాతంత్య్ర సమరయోధులు, మహనీయుల త్యాగాలు నేటి తరానికి అర్థమయ్యేలా, దేశభక్తిని ద్విగుణీకృతం చేసే విధంగా రాష్ట్రంలో కార్యక్రమాలు రూపొందించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. గడప గడపకూ, వాడ వాడకు జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని, క్రీడాపోటీలు, వక్తృత్వ పోటీలు, వ్యాసరచన పోటీలు, కవిసమ్మేళనాలు, జాతీయ భావాలను రగలించే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులకు సూచించారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజైన 15 ఆగస్ట్ ముందు వారం రోజులు.. అనంతరం వారం రోజులుగా.. మొత్తం 15 రోజుల పాటు భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ ద్విసప్తాహ కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 75 ఏండ్ల స్వతంత్ర్య భారత వజ్రోత్సవ ద్వి సప్తాహం నిర్వహణపై శనివారం నాడు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
దేశభక్తిని ద్విగుణీకృతం చేయాలి : సీఎం కేసీఆర్
- Advertisement -
- Advertisement -