ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. ఇక భారత్లో కూడా రోజుకి 24 వేలకుపైగా కరోనా కేసులు నమోదవుతుండగా కరోనా కేసుల్లో రష్యాను దాటేసింది భారత్. దీంతో కరోనా కేసుల్లో మూడోస్ధానానికి చేరింది భారత్.
గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 24,248 పాజిటివ్ కేసులు నమోదు కాగా 425 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,97,413కు చేరింది. ఇప్పటివరకు కరోనా నుండి కోలుకుని 4,24,433 మంది కోలుకొగా 2,53,287 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. దేశంలో కరోనాతో 19,693 మంది మరణించారు.
దేశంలో కరోనా కేసులు ప్రారంభమైనప్పటి నుంచి జూలై 5 వరకు 99,69,662 నమూనాలను పరీక్షించామని ఐసీఎంఆర్ తెలిపింది. ఆదివారం ఒక్కరోజే 1,80,596 మందికి పరీక్షలు నిర్వహించామని వెల్లడించింది.
రష్యాలో ప్రస్తుతం 6,81,251 కరోనా కేసులు ఉండగా 29,82,928 కరోనా పాజిటివ్ కేసులతో అమెరికా, 16,04,585 పాజిటివ్ కేసులతో బ్రెజిల్ దేశాలు భారత్ కంటే ముందున్నాయి.