కరోనాకు వ్యాక్సిన్‌ ఇప్పట్లో రాదు..!

163
sowmya
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి రోజురోజుకి విస్తరిస్తూనే ఉంది. కరోనాను జయించేందుకు వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో చాలాదేశాలు బిజీగా ఉన్నాయి. ఇక భారత్‌లో ఆగస్టు 15 వరకు వ్యాక్సిన్ వస్తుందని ఐసీఎంఆర్ ధీమా వ్యక్తం చేస్తుండగా కరోనాకు వ్యాక్సిన్ ఇప్పట్లో వచ్చే ప్రసక్తేలేదని చెబుతున్నారు డబ్ల్యూహెచ్‌వో శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్.

కరోనా వ్యాక్సిన్ ట్ర‌యల్స్ మూడు దశలను దాటుకొని సజావుగా ముందుకుసాగినా… వ్యాక్సిన్‌ రావడానికి కనీసం 6 నుంచి 9 నెలల స‌మ‌యం ప‌ట్టొచ్చ‌ని ఆమె స్పష్టం చేస్తున్నారు.

ఈ ఏడాది కరోనాకు వ్యాక్సిన్ వచ్చే పరిస్ధితి లేదని తెలిపారు. రోగ నిరోధక శక్తిని పెంచే సామర్ధ్యపు సమాచారం ఒక్కటే క‌రోనా వ్యాక్సిన్‌ విశ్వసనీయతకు ప్రాతిపదిక కాద‌ని తెలిపారు సౌమ్య స్వామినాథ‌న్. డబ్ల్యూహెచ్‌వో జారీచేసిన టార్గెట్‌ ప్రొడక్ట్‌ ప్రొ ఫైల్స్‌ ప్రమాణాలకు అనుగుణంగా అది ఉండాలన్నారు.

- Advertisement -