వెస్టిండీస్‌తో మూడు టీ20ల సిరీస్‌ను భారత జట్టు 2-1తో ఘన విజయం సాధించింది. ముంబయిలో జరిగిన చివరి టీ20 మ్యాచ్ లో భారత్ 67 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 240 రన్స్ చేసింది. తరువాత ఛెజింగ్‌లో విండీస్ 8 వికెట్లకు 173 పరుగులు మాత్రమే చేశారు. ఆ జట్టులో కెప్టెన్ పొలార్డ్ 68 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. షిమ్రోన్ హెట్మెయర్ 41 పరుగులు చేశాడు. మిగతా బ్యాట్స్ మెన్ విఫలం కావడంతో విండీస్ కు ఓటమి తప్పలేదు. భారత బౌలర్లలో చహర్, భువీ, షమీ, కుల్దీప్ తలో 2 వికెట్లతో రాణించారు.
అంతకుముందు టీమిండియా టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (34 బంతుల్లో 71), కేఎల్ రాహుల్ (56 బంతుల్లో 91), కెప్టెన్ కోహ్లీ (29 బంతుల్లో 70 నాటౌట్) అదరగొట్టారు. దాంతో టీమిండియా 20 ఓవర్లలో 3 వికెట్లకు 240 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. రాహుల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది సిరీ్‌సగా నిలిచారు.
స్కోరు బోర్డు..
భారత్: రోహిత్ శర్మ (సి) హేడెన్ (బి) విలియమ్స్ 71, కేఎల్ రాహుల్ (సి) పూరన్ (బి) కాట్రెల్ 91, రిషభ్ పంత్ (సి) హోల్డర్ (బి) పొలార్డ్ 0, కోహ్లీ (నాటౌట్) 70, శ్రేయాస్ అయ్యర్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 20 ఓవర్లలో 240/3; వికెట్ల పతనం: 1-135, 2-138, 3-233; బౌలింగ్: షెల్డన్ కాట్రెల్ 4-0-40-1, హోల్డర్ 4-0-54-0, పియర్ 2-0-35-0, విలియమ్స్ 4-0-37-1, హేడెన్ వాల్ష్ 4-0-38-0, పొలార్డ్ 2-0-33-1.
వెస్టిండీస్: లెండిల్ సిమన్స్ (సి) శ్రేయాస్ (బి) షమి 7, బ్రండన్ కింగ్ (సి) కేఎల్ రాహుల్ (బి) భువనేశ్వర్ 5, షిమ్రన్ హెట్‌మయర్ (సి) కేఎల్ రాహుల్ (బి) కుల్దీప్ 41, నికొలస్ పూరన్ (సి) దూబే (బి) దీపక్ 0, పొలార్డ్ (సి/సబ్) జడేజా (బి) భువనేశ్వర్ 68, హోల్డర్ (సి/సబ్) మనీష్ పాండే (బి) కుల్దీప్ 8, హేడెన్ వాల్ష్ (బి) షమి 11, పియర్ (సి/సబ్) జడేజా (బి) దీపక్ 6, కెస్రిక్ విలియమ్స్ (నాటౌట్) 13, కాట్రెల్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 20 ఓవర్లలో 173/8; వికెట్ల పతనం: 1-12, 2-17, 3-17, 4-91, 5-103, 6-141, 7-152, 8-169; బౌలింగ్: దీపక్ చాహర్ 4-0-20-2, భువనేశ్వర్ 4-0-41-2, మహమ్మద్ షమి 4-0-25-2, శివమ్ దూబే 3-0-32-0, కుల్దీప్ యాదవ్ 4-0-45-2, వాషింగ్టన్ సుందర్ 1-0-5-0.3