సమత కుటుంబానికి అండగా నిలుస్తాం..

440
reka naik

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం ఎల్లాపటార్ గ్రామ శివారులో గత నెల 24న అత్యాచారం హత్యకు గురైన సమత ఘటన జరిగిన స్థలాన్ని ఈరోజు జడ్పీ చైర్ పర్సన్ కోవలక్ష్మీ ,ఎమ్మెల్యే రేఖా నాయక్ పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో జెడ్పీ చేర్ పర్సన్ కోవా లక్ష్మి మాట్లాడుతూ.. హత్యాచారానికి గురైన సమత ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున అండగా నిలుస్తాం.. ఈ దారుణ ఘటనకు కారకులైన దుర్మార్గులకు శిక్ష పడేలా ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసింది జడ్పీ చైర్ పర్సన్ కోవలక్ష్మీ తెలిపారు.

mla reka naik

ఎమ్మెల్యే రేఖా నాయక్ మాట్లాడుతూ.. సమత ఘటనపై వారి కుటుంబ సభ్యులకు అండగా నిలవాల్సిన ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయి మండిపడ్డారు. సమత భర్తకు రెవెన్యూ శాఖలో అటెండార్ ఉద్యోగంతో పాటు పిల్లలిద్దరికి ప్రభుత్వ మోడల్ స్కూల్‌లో ఉచితంగా విద్యను అందిస్తాం.. ఎస్ సి కార్పొరేషన్ ద్వారా 8.5 లక్షలు బాధిత కుటుంబానికి అందజేస్తామని తెలిపారు. ఖానాపూర్‌లో డబల్ బెడ్ రూమ్ ఇంటితో పాటు, దళిత బస్తి కింద 3 ఎకరాల భూమిని,5000 వేల రూపాయల పెన్షన్ బాధిత కుటుంబానికి అందజేస్తాం.బాధిత కుటుంబానికి అండగా నిలిచిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్యే రేఖా నాయక్.

zptc kova laxmi