టీ20 సిరీస్‌ భారత మహిళలదే

308
indian criket team
- Advertisement -

భారత మహిళా క్రికెట్‌ జట్లు మాంచి జోష్‌లో ఉంది. ఇప్పటి వరకు కేవలం పురుషుల క్రీడగానే ముద్రపడిన క్రికెట్‌ ఆటలో తాము కూడా భాగస్వాములమేనని నిరూపిస్తూ మగవారికి ఏం తీసిపోని విధంగా మహిళా క్రికెట్‌లో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నారు భారత మహిళా క్రికెట్‌ జట్టు మహారాణులు. ఇప్పటికే శ్రీలంక జట్టుతో జరిగిన వన్డే సిరీస్‌లో అద్భుతమైన ఆటతీరు కనబర్చి వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది.

 inidan criket temas womens

అదే రీతిలో టీ20 మ్యాచ్‌లో కూడా భారత మహిళలు సమిష్టి కృషితో శ్రీలంకను మట్టికరిపించి 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించారు. దీంతో భారత మహిళల జట్టు శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్‌, టీ20 సిరీస్‌ను గెలుచుకుంది. భారత మహిళా జట్టులో అనుజ పటేల్ ఆల్‌రౌండ్ షో, జెమీమా రోడ్రిగ్స్ అద్భుతమైన ఆటతీరును కనబరిచారు.

- Advertisement -