భారత్ నుంచి వచ్చే విమానాలపై నిషేధం..

129
India Travellers

భారత్ నుంచి మా దేశానికి రావొద్దు అంటున్న దేశాల సంఖ్య పెరుగుతోంది. కోవిడ్-19 రెండో ప్రభంజనం తీవ్రంగా ఉండటంతో బ్రిటన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా, సింగపూర్ వంటి దేశాలు ఇప్పటికే భారతీయ ప్రయాణికులపై నిషేధం విధించాయి. ఆ జాబితాలో తాజాగా శ్రీలంక చేరింది.

భారత్ నుంచి తమ దేశానికి వచ్చే విమానాలపై నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని శ్రీలంక ప్రకటించింది. భారత్ నుంచి వచ్చే ప్రయాణికులు శ్రీలంకలో దిగేందుకు ఇకపై అనుమతించబోమని శ్రీలంక పౌర విమానయాన సంస్థ స్పష్టం చేసింది. భారత్ లో కరోనా విలయం సృష్టిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.