- Advertisement -
భారత్ సెమీస్ ఆశలు సజీవంగానే ఉన్నాయి. సూపర్-12 గ్రూప్ 2లో భాగంగా స్కాట్లాండ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో భారత్ మరో 81 బంతులుండగానే 8 వికెట్ల తేడాతో గెలిచింది. భారత్ సెమీస్‌కు చేరాలంటే న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధిస్తేనే సాధ్యం అవుతుంది.
స్కాట్లాండ్ విధించిన 86 పరుగుల లక్ష్యాన్ని కేవలం 6.3 ఓవర్లలోనే 2 వికెట్లు కొల్పోయి 89 పరుగులు చేసి విజయం సాధించింది. కేఎల్ రాహుల్ (19 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 50), రోహిత్ (16 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 30) రాణించారు.
అంతకముందు బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ 17.4 ఓవర్లలో 85 పరుగులకు ఆలౌటైంది. మన్సీ (24), లీస్క్ (21) రాణించారు. జడేజా, షమికి మూడు.. బుమ్రాకు రెండు వికెట్లు దక్కాయి.
- Advertisement -