చీరకట్టులో క్రికెట్ ఆడిన మిథాలీ..

290
mithali raj
- Advertisement -

భారత మహిళల క్రికెట్‌పై వంద పేజీల పుస్తకం రాస్తే 80 వరకు ఆమె గురించే రాయల్సి ఉంటుంది. ఎందుకంటే క్రికెటర్‌గా ఆమె ప్రస్థానం… మహిళల క్రికెట్‌ పురోగ‌మ‌నం సమాంతరంగా సాగుతాయి. ఆమె మరెవరో కాదు మిథాలీరాజ్‌. చిన్న వయసులోనే ఆటలో అరంగేట్రం చేసి ఎవరికీ సాధ్యం కాని ఘనతలు అందుకుంది.

తాజాగా టీమిండియా తొలిసారిగా టీ20 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌కు చేరిన సందర్భంగా మిథాలీపై ఓ ప్రత్యేక వీడియోని రూపొందించారు. ఈ వీడియోలో మిథాలీ చీరకట్టులో క్రికెట్‌ ఆడుతూ కనిపించగా ఈ వీడియోను మిథాలీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. కమాన్‌ టీమిండియా, ప్రపంచకప్‌ను తీసుకురండి అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అంతర్జాతీయ మహిళ దినోత్సవం రోజునే(మార్చి 8) టీమిండియా ఆసీస్‌తో ప్రపంచకప్‌ ఫైనల్‌లో తలపడనున్న సంగతి తెలిసిందే. తొలిసారి టీ20 వరల్డ్ కప్‌ ఫైనల్‌కు చేరిన భారత్‌ టైటిల్ గెలవాలని అంతా ఆకాంక్షిస్తున్నారు.

2021లో జరిగే వన్డే ప్రపంచకప్‌పై దృష్టిసారించిన మిథాలీ రాజ్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తం 88 టీ20 మ్యాచ్‌లు ఆడిన మిథాలీ 2,364 పరుగులు చేసింది. కెప్టెన్‌గా 32 టీ20లకు నాయకత్వం వహించింది.

- Advertisement -