ఉప్పల్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలివన్డేలో భారత్ నరాలు తెగే ఉత్కంఠ మధ్య గెలుపొందింది. 350 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 337 పరుగులు చేసి ఆలౌట్ అయి 12 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఓ దశలో 131 పరుగులకే 6 వికెట్లు కొల్పోయి కష్టాల్లో పడ్డ కివీస్‌ను బ్రేస్ వెల్ అద్భుత ఇన్నింగ్స్‌తో చమటలు పట్టించాడు. 78 బంతుల్లో 12 ఫోర్లు, 10 భారీ సిక్స్ లతో 140 పరుగులు భారత్ ను హడలెత్తించాడు. బ్రేస్ వెల్‌కు తోడు శాంటర్న్ 57 పరుగులు చేశాడు. చివరి ఓవర్‌లో 20 పరుగులు కావాల్సి ఉండగా తొలిబంతికే సిక్సర్ బాధాడు బ్రేస్ వెల్. తర్వాత బంతిని శార్దూల్ వైడ్ వేయడంతో సమీకరణం 5 బంతుల్లో 13 పరుగులుగా మారింది. ఈ క్రమంలో అద్బుతబంతితో బ్రేస్‌వెల్‌ని ఔట్ చేసి భారత్‌కు విజయాన్ని అందించాడు శార్దూల్. ఈ మ్యాచ్ లో భారత బ్యాటర్లలో ఓపెనర్ శుభ్ మన్ గిల్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. గిల్ 149 బంతుల్లో 208 పరుగులు చేశాడు.
ఇక అంతకముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కొల్పోయి 349 పరుగులు చేసింది. యువ ఓపెనర్ శుభ్ మన్ గిల్ సిక్సర్లు, ఫోర్ల మోత మోగించాడు. 149 బంతుల్లో 9 సిక్స్‌లు,19 ఫోర్లతో 208 పరుగులు చేశాడు. టాప్ ఆర్డర్ అంతా విఫలమైన ఒక్కడే క్రీజ్‌లో నిలబడి భారీ స్కోరు చేశాడు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ లో భారత్ 1-0తో లీడ్ లో ఉంది. ఈ నెల 21న రాయ్ పూర్ లో రెండో వన్డే జరగనుంది.
ఇవి కూడా చదవండి..