న్యూజిలాండ్ గడ్డపై తొలి టీ20 సిరీస్ గెలుపుతో టీమ్‌ఇండియా హిస్టరీ క్రియేట్ చేసింది. 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇంకో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే భారత్ 3-0తో సిరీస్ కైవసం చేసుకుంది. ముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 179 పరుగులు చేసింది.
అనంతరం 180 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 179 పరుగుల చేసింది. ఇరు జట్ల స్కోర్ సమం కావడంతో మ్యాచ్ డ్రా అయ్యింది. దీంతో ఇరుజట్లు సూపర్ ఓవర్‌కు వెళ్లారు.
ఇక ఈ సూపర్ ఓవర్‌లో మొదట కివీస్ తరఫున విలియమ్సన్, గప్టిల్ బరిలో దిగి 6 బంతుల్లో 17 పరుగులు చేశారు. ఆపై 18 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన రోహిత్, రాహుల్ జోడీ పోరాటపటిమ చూపించడం మ్యాచ్ భారత్ వశమైంది.
రోహిత్ వరుసగా 5, 6వ బంతులను స్టాండ్స్ లోకి పంపడంతో భారత్ గెలుపుతీరాలకు చేరింది. ఈ మ్యాచ్ విజయంతో 5 టి20ల సిరీస్ ను టీమిండియా 3-0తో కైవసం చేసుకుంది. ఇరుజట్ల మధ్య నాలుగో టి20 జనవరి 31న వెల్లింగ్టన్‌లో జరగనుంది.