రెండో టీ20లో భారత్‌ గెలుపు….

256
india vs newzealand
- Advertisement -

తొలి టీ20 ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది రోహిత్ సేన. ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో వికెట్ల తేడాతో గెలుపొందింది. కివీస్ విధించిన 159 పరుగుల లక్ష్యాన్ని ఓవర్లలో చేధించింది. ఓపెనర్లు రోహిత్,ధావన్‌ రాణించడంతో భారత్ గెలుపు సునాయసమైంది. రోహిత్ అర్థసెంచరీతో రాణించగా ధావన్‌ చక్కని సహకారాన్ని అందించాడు. ముఖ్యంగా రోహిత్ కివీస్ బౌలర్లపై ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 29 బంతుల్లో (4 సిక్సర్లు,3 ఫోర్ల)తో 50 పరుగులు చేయగా ధావన్‌ 30 పరుగులు చేసి పెవిలియన్ బాటపట్టాడు. విజయ్ శంకర్‌ 14 పరుగులు చేసి పెవిలియన్ బాటపట్టగా పంత్ 40,ధోని 19 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు.భారత్ 18.5 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కొల్పోయి 162 పరుగులు చేసి టార్గెట్ ను చేధించింది.

అంతకముందు టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి టీ20లో భారత బౌలర్లపై ఆకాశమే హద్దుగా చెలరేగిన సీఫెర్ట్ ఈ మ్యాచ్‌లో కేవలం 12 పరుగులకే పెవిలియన్ బాటపట్టాడు. అయితే తర్వాత వచ్చిన కివీస్ బ్యాట్స్‌ మెన్‌ కృనాల్ పాండ్యా బౌలింగ్‌ ధాటికి వెంటవెంటనే పెవిలియన్ బాటపట్టారు.ఈ దశలో క్రీజులో వచ్చిన గ్రాండ్ హోమ్,టేలర్ ఆచితూచి ఆడుతు స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ముఖ్యంగా గ్రాండ్‌హోమ్ తొలుత నెమ్మదిగా ఆడినా తర్వాత సిక్సర్లతో విరుచుకపడ్డాడు.

ind vs nz

గ్రాండ్ హోమ్ హాఫ్‌ సెంచరీ చేసి ఔటౌన తర్వాత రాస్‌ టేలర్‌(42) కూడా పెవిలియన్ బాటపట్టారు. దీంతో కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కొల్పోయి 158 పరుగులు చేసింది. కృనాల్‌ పాండ్య మూడు , ఖలీల్‌ అహ్మద్‌ రెండు, భువి, హార్దిక్‌ పాండ్య చెరో వికెట్ తీశారు.

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి టీ20 కివీస్,రెండో టీ20 భారత్ గెలవడంతో సిరీస్‌ 1-1తో సమంగా నిలిచింది.

- Advertisement -