బంగ్లాను చిత్తుచేసిన భారత్…

102
ind
- Advertisement -

మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. భారత్ విధించిన 230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా 40.3 ఓవర్లలో కేవలం 119 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ 110 పరుగుల తేడాతో విజయం సాధించింది.

స్నేహ్‌ రాణా (27 పరుగులు; 4/30) ఆల్‌రౌండ్‌ షోతో రాణించగా బంగ్లాదేశ్‌ 40.3 ఓవర్లలో 119 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ సెమీస్ ఆశలు సజీవంగా ఉన్నాయి.

భారత ఇన్నింగ్స్‌లో టాపార్డర్‌ బ్యాటర్‌ యస్తిక భాటియా (80 బంతుల్లో 50; 2 ఫోర్లు) అర్ధసెంచరీతో రాణించగా ఓపెనర్లు షఫాలీ వర్మ (42 బంతుల్లో 42; 6 ఫోర్లు, 1 సిక్స్‌) ధాటిగా ఆడగా, స్మృతి మంధాన (51 బంతుల్లో 30; 3 ఫోర్లు) మెరుగ్గా ఆడింది. బంగ్లా బౌలర్లలో రీతూ మోని 3, నహీదా 2 వికెట్లు తీశారు.

- Advertisement -