కేంద్రం గిరిజనుల గొంతు కోస్తోంది- మంత్రి హరీష్‌

50
- Advertisement -

గిరిజన రిజర్వేషన్ల కోసం తెలంగాణ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలు రాలేదని పార్లమెంట్ సాక్షిగా కేంద్రమంత్రి పచ్చి అబద్ధాలు చెప్పారని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఈరోజు ఆయన తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేంద్రమంత్రి మాటలు రాష్ట్ర గిరిజనుల మనోభావాలను అవమానించేలా ఉన్నాయన్నారు. బీజేపీ కేంద్రంలో ప్రభుత్వాన్ని నడుపుతుందా? లేదా ప్రైవేట్ కంపెనీ నడుపుతున్నదా? అని ప్రశ్నించారు.

కేంద్ర మంత్రి మాటలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కించపర్చేలా ఉన్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రధానికి లేఖ రాశారు. మంత్రి సత్యవతి రాథోడ్ సైతం లేఖ రాశారని తెలిపారు. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఆనాడు అసెంబ్లీలో బీజేపీ ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు. కిషన్ రెడ్డి ఆనాడు అసెంబ్లీలో బిల్లుకు మద్దతు తెలిపారు. పార్లమెంట్ సాక్షిగా పచ్చి అబద్దాలు ఆడారని దుయ్యబట్టారు. బీజేపీ కేంద్రంలో ప్రభుత్వాన్నీ నడుపుతుందా? అబద్దాల ఫ్యాక్టరీ నడుపుతున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్రాన్ని ఏ అంశం అడిగినా నో డేటా అవలేబుల్ అనే మాట తప్ప సమాధానం ఇవ్వరు. తడిగుడ్డతో గిరిజనుల గొంతు కొస్తోంది కేంద్ర ప్రభుత్వం. గిరిజనుల రిజర్వేషన్లు రాజకీయంగా చూడొద్దు అన్నారు. లక్షల మంది భవిష్యత్ అనేది మర్చిపోవద్దు. పార్లమెంట్ ను తప్పుదోవ పెట్టె విధంగా కేంద్రమంత్రులు అబద్ధాలు చెప్తున్నారు మంత్రి. పార్లమెంట్ లో అబద్ధాలు చెప్పిన కేంద్రమంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్‌ చేశారు.

గిరిజన యూనివర్సిటీ లలో నిరసనలు చేయాలి. అబద్ధాలు చెప్పే బీజేపీ ప్రభుత్వానికి కొనసాగే హక్కు లేదు. అబద్ధాలు చెప్పే బీజేపీ దేశానికి- రాష్ట్రాలకు అన్యాయం చేస్తుందన్నారు. పార్లమెంట్ సాక్షిగా గిరిజనులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నా.. రాష్ట్ర బిజెపి నాయకులు సొల్లు పురాణం మాట్లాడటం కాదు గిరిజనుల బిల్లు పాస్ చేయించండి అని హరీష్ రావు అన్నారు.

మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. గిరిజన రిజర్వేషన్ల బిల్లుపై కేంద్ర గిరిజనమంత్రి మాట్లాడిన మాటలను ఖండిస్తున్నట్లు తెలిపారు. అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రతిపాదనలు పంపితే కేంద్రమంత్రి అవగాహన లేకుండా సోయితప్పి మాట్లాడారని మండిపడ్డారు. కనీస అవగాహన లేని మంత్రిని గిరిజన మంత్రిగా పెట్టడం గిరిజనులను అవమానించడమేనన్నారు. గిరిజనుల పై అవగాహన లేని మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

- Advertisement -