ఆసీస్‌తో తొలి టీ20లో కోహ్లీ సేన గెలుపు…

60
ind

ఆసీస్‌తో వన్డే సిరీస్‌ కొల్పోయిన భారత్…టీ20 సిరీస్‌లో అదరగొట్టింది. ఆసీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ విధించిన 162 పరుగుల లక్ష్యచేధనలో ఆసీస్ 20 ఓవర్లలో 7 వికెట్లు కొల్పోయి 150 పరుగులు మాత్రమే చేసింది. ఆసీస్ బ్యాట్స్‌మెన్‌లలో డార్సీ షార్ట్‌ 34, ఫించ్‌ 35,స్మిత్‌ 12, హెన్రిక్స్‌ 30 పరుగులతో రాణించారు.

అంతకముందు టాస్ గెలిచిన భారత్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌ (40 బంతుల్లో 51; 5 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీ చేయగా, రవీంద్ర జడేజా (23 బంతుల్లో 44 నాటౌట్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌) దూకుడుగా ఆడాడు. ఇక భారత విజయంలో కీలకపాత్ర పోషించారు స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌ (3/25). మూడు కీలక వికెట్లు పడగొట్టి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు అందుకున్నాడు. రెండో వన్డే ఆదివారం(రేపు) జరగనుంది.