IND VS SA ODI : సిరీస్ కైవసం..!

35
- Advertisement -

టీమిండియా సౌతాఫ్రికా మద్య జరిగిన మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో టీమిండియా సత్తా చాటింది. 2-1 తేడాతో సిరీస్ ను సొంతం చేసుకుంది. మొదటి మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించగా రెండో మ్యాచ్ లో సౌతాఫ్రికా విజయం సాధించింది. ఇక నిన్న జరిగిన మూడో మ్యాచ్ తో మళ్ళీ టీమిండియా అద్భుత ప్రదర్శన కనబరిచి విజయాన్ని సొంతం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. టీమిండియా బ్యాట్స్ మెన్స్ లలో సంజూ సంసన్ (108) సెంచరీతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత తిలక్ వర్మ (52) హాఫ్ సెంచరీతో రాణించగా, రింకూ సింగ్ (38) చేశాడు. ఇక మిగిలిన బ్యాట్స్ మెన్స్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. .

ఆ తర్వాత లక్ష్య చేధనలో సఫారీ జట్టు 218 పరుగులకే కుప్పకూలింది. టోని డే జోర్జ్ (81) పరుగులతో రాణించినప్పటికి మిగిలిన బ్యాట్స్ మెన్స్ నిరాశపరచడంతో సఫారీ జట్టుకు ఓటమి తప్పలేదు. టీమిండియా బౌలర్స్ లలో అర్షదీప్ సింగ్ నాలుగు వికెట్లు, అవేష్ ఖాన్ రెండు వికెట్లు, వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు, ముఖేష్ కుమార్, ఆక్సర్ పటేల్ చెరో వికెట్ తీసి సఫారీ జట్టు నడ్డి విరిచారు. దీంతో మూడో వన్డేలో భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. 2018 తరువాత సౌతాఫ్రికా గడ్డపై ఒక్క వన్డే సిరీస్ కూడా గెలవని టీమిండియా దాదాపు ఆదేళ్ళ తర్వాత వన్డే సిరీస్ గెలిచింది. ఇక ఈ నెల 26 నుంచి ఇరు జట్ల మద్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ టెస్ట్ సిరీస్ తో టీమిండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి జట్టులోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. మరి సఫారీ గడ్డపై టెస్ట్ సిరీస్ కూడా సొంతం చేసుకుంటుందేమో చూడాలి.

Also Read:Tamarind:చింతపండు అతిగా వాడితే ప్రమాదమా?

- Advertisement -