ఆసియా కప్ లో భాగంగా నేడు హైవోల్టేజ్ పోరుకు తెరలేవనుంది. సూపర్ 4 లో నేడు చిరకాల ప్రత్యర్థులైన భారత్ మరియు పాకిస్తాన్ తలపడనున్నాయి. గ్రూప్ దశలో ఈ రెండు జట్ల మద్య జరిగిన మ్యాచ్ లో వరుణుడు అడ్డంకిగా మారడంతో ఆ మ్యాచ్ నిరాశ పరిచింది. దీంతో మరోసారి ఈ రెండు జట్లు సూపర్ 4 లో తలపడుతుండడంతో అందరి చూపి ఈ దాయాదుల పోరుపై పడింది. ప్రస్తుతం పాకిస్తాన్ బంగ్లాదేశ్ పై గెలిచిన ఉత్సాహంతో ఉంది. ఎలాగైనా టీమిండియా ను కూడా ఓడించాలని గట్టి పట్టుదలగా ఉంది. పాక్ యొక్క ప్రధాన బలం బౌలింగ్, షాయిన్ అఫ్రిది, షాదబ్ వంటి బౌలర్స్ ఫుల్ ఫామ్ లో ఉన్నారు..
గత మ్యాచ్ లో టీమిండియా ను తక్కువ స్కోర్ కు పరిమితం చేయడంలో వీరు ముఖ్య పాత్ర పోషించారు. ఇక టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగానే ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ నేపాల్ తో జరిగిన మ్యాచ్ ద్వారా ఫామ్ లోకి వచ్చాడు. మిడిలార్డర్ లో ఇషన్ కిషన్, హర్ధిక్ పాండ్య, జడేజా వంటి వాళ్ళు కూడా ఫామ్ లో ఉన్నారు. కాగా టాప్ ఆర్డర్ లో ప్రస్తుతం అందరి చూపు విరాట్ కోహ్లీ పైనే ఉంది. ఎందుకంటే పాక్ పై మెరుగైన రికార్డ్స్ ఉన్న కింగ్ కోహ్లీ గత మ్యాచ్ లో నిరాశ పరిచాడు.
అయితే ఈ మ్యాచ్ తో కోహ్లీ చెలరేగే అవకాశం ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఎందుకంటే మ్యాచ్ జరగనున్న కొలంబో లో విరాట్ కోహ్లీ కి మంచి రికార్డ్ ఉంది. కొలంబోలో గత మూడు మ్యాచ్ లలో కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. అందువల్ల కోహ్లీకి కలిసొచ్చిన స్టేడియంలో అదికూడా పాక్ పై మ్యాచ్ కావడంతో రన్ మిషిన్ ఎలా చెలరేగుతాడో అనేది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కాగా ఈ మ్యాచ్ కు కూడా వర్షం అడ్డంకి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే రేపు రిజర్వ్ డే గా మ్యాచ్ నిర్వహించే అవకాశం ఉందట. మరి ఈ హైవోల్టేజ్ మ్యాచ్ లో ఎవరిది పై చేయి గా నిలుస్తుందో చూడాలి.
Also Read:Chandrababu: కుట్రదారు చంద్రబాబే..నాకేం తెలియదు!