ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్స్ అనంతరం దుబాయిలో ఓ షూటింగ్‌లో పాల్గొన్నారు విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఒక పురాతన వస్తువుల షాప్‌లో నిలబడినట్లు వీడియోలో కనిపిస్తుండగా, పక్కన కెమెరా సెటప్ కూడా కనపడుతోంది.విరాట్ కోహ్లీ వైట్ టీ-షర్ట్‌తో పాటు బేజీ జాకెట్ ధరించగా, అనుష్క శర్మ ఓ కట్-షోల్డర్ డ్రెస్‌లో, వదలిన జుట్టుతో కనిపిస్తోంది.
ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అయిన వెంటనే, అభిమానులు రెడ్-హార్ట్ ఎమోజీలతో తమ ప్రేమను వ్యక్తం చేశారు. అలాగే చాంపియన్స్ ట్రోఫీ 2025 గెలిచిన కొన్ని రోజుల తర్వాత, హర్షిత్ రాణాతో కలిసి విరాట్, అనుష్క పోజిచ్చిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా స్టేడియంలో సందడి చేసింది అనుష్క. తన భర్తకు మద్దతుగా ప్రతీ మ్యాచ్‌లో స్టేడియంలో హాజరై హర్షధ్వానాలు చేస్తూ కనిపించింది. స్టేడియంలో అనుష్క, విరాట్‌కు సంబంధించిన అనేక ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అయ్యాయి.
View this post on Instagram
Also Read:ఏకైక మగాడు అతనే..ఆర్జీవీ సెన్సేషన్!

