ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసిన అజాజ్ పటేల్..

94
azaz

భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ బౌలర్ అద్భుతం చేశాడు. ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీశాడు. ఆజాజ్ ధాటికి ఇండియా బ్యాట‌ర్లు క్యూక‌ట్టారు. అజాజ్ సూప‌ర్ షో ధాటికి ఇండియా త‌న తొలి ఇన్నింగ్స్‌లో 325 ర‌న్స్‌కు ఆలౌటైంది. మ‌యాంక్ 150, అక్ష‌ర్ ప‌టేల్ 52 ర‌న్స్ స్కోర్ చేశారు. ఈ మ్యాచ్‌లో 47.5 ఓవ‌ర్లు వేసి 119 ర‌న్స్ ఇచ్చి 10 వికెట్ల‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు.

గ‌తంలో ఈ ఘ‌న‌త‌ను అందుకున్న‌వారిలో ఇండియ‌న్ స్పిన్న‌ర్ అనిల్ కుంబ్లే, జిమ్ లేక‌ర్‌లు ఉన్నారు. పాకిస్థాన్‌తో జ‌రిగిన టెస్టులో కుంబ్లే మొత్తం 10 వికెట్లు తీసుకున్న విష‌యం తెలిసిందే.